Tuesday, August 6, 2019

కేంద్ర మాజీ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికరం.



కేంద్ర మాజీ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. వారి మృతి దేశానికి, బిజెపికి తీరని లోటు. బిజెపి తెలంగాణ వారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తుంది. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తుంది. ఓం శాంతి

సుష్మా స్వరాజ్ తెలంగాణ చిన్నమ్మగా ప్రసిద్ధి. వారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారు. తెలంగాణ వాణిని పార్లమెంటులో గట్టిగా వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో వారి పాత్ర కీలకమైంది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో శ్రీమతి సుస్మాస్వరాజ్ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

అతి చిన్న వయసులోనే రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా దేశ ప్రజలకు ఎనలేని సేవలందించారు. ప్రతిపక్ష నాయకురాలిగా ప్రజా సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకు వచ్చేవారు. అమ్మాయిలకు సుష్మ అని పేరు పెడితే ఆప్యాయంగా సుష్మ స్వరాజ్ అని పిలుచుకునేవారు.

-Telangana unit of Bharatiya Janata Party (BJP)

No comments:

Post a Comment