Friday, December 20, 2019

"పోలవరం ప్రాజెక్టుకు 'ప్రధానమంత్రి పోలవరం' అని నామకరణం చెయ్యాలి" - రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు.


"పోలవరం ప్రాజెక్టుకు 'ప్రధానమంత్రి పోలవరం' అని నామకరణం చెయ్యాలి"
 - రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్ట్ ఏపీ రీ-ఆర్గనైజేషన్ యాక్ట్-2019 
విభజన హామిలో భాగంగా 100% నిధులతో కేంద్రం నిర్మిస్తోందని గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల పోలవరం ఆలస్యం అవుతోందని,కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నా కేంద్రానికి ఖ్యాతి దక్కడం లేదని అన్నారు."పోలవరం ప్రాజెక్టుకు 'ప్రధానమంత్రి పోలవరం' అని నామకరణం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

పోలవరం ప్రాజెక్టు లెక్కలను కేంద్రానికి చెప్పడంలో విఫలమైందని అందువలన నిధుల విడుదల ఆలస్యం అవుతోందని తెలిపారు.ఇప్పటివరకు కేంద్రం 6,764 కోట్ల రూపాయలను అందజేశారు.త్వరలో రూ. 1,850 కోట్లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

No comments:

Post a Comment